లైవ్‌లో ఇరాన్ టీవీ యాంకర్ కన్నీళ్లు
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:27 AM
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన విషయాన్ని ప్రకటిస్తూ ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ న్యూస్ రీడర్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఖమేనీ మృతిని ప్రకటిస్తూ భావోద్వేగం
టెహ్రాన్, మార్చి 1: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన విషయాన్ని ప్రకటిస్తూ ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ న్యూస్ రీడర్ కన్నీటిపర్యంతమయ్యారు. విలపిస్తూనే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరోవైపు ఖమేనీ మరణ వార్తను చదువుతూ టీవీ యాంకర్ మర్యమ్ అజర్ చెరహ్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకొనేందుకు ప్రయత్నిస్తూనే, ‘త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లలు నేడు ఖమేనీ కోసం విలపిస్తున్నారని, ఇమామ్ అలీ లాగా ఖమేనీ చిరస్థాయిగా నిలిచిపోతారని నివాళులర్పించారు. ‘‘ఈరోజు వారు సంబరాలు చేసుకోవచ్చు. కానీ, ఇది ముగియలేదు. ట్రంప్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని అజర్ చెరహ్ హెచ్చరించారు.