Share News

అమెరికా, ఇజ్రాయెల్‌ భ్రమలో ఉన్నాయి

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:02 AM

ఇరాన్‌ ఉన్నత నాయకులను హత్య చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్‌ భ్రమపడ్డాయని ఆ దేశ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌ భ్రమలో ఉన్నాయి

ఇరాన్‌ ఉన్నత నాయకులను హత్య చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్‌ భ్రమపడ్డాయని ఆ దేశ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. ఇరానీయులు ప్రస్తుత యుద్ధ సమయంలో చూపుతున్న తెగువను ప్రశంసించారు. ప్రజలంతా ఒక్కటిగా రక్షణ కవచంలా నిలబడ్డారని.. శత్రువు గందరగోళపడి చిత్రమైన ప్రకటనలు చేసేలా షాకిచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు మొజ్తాబా ప్రకటనను ఇరాన్‌ టీవీలో యాంకర్‌ చదివి వినిపించారు. ఇక మొజ్తాబా అధికారులతో సమావేశమయ్యారంటూ ఒక వీడియోను ప్రసారం చేశారు. నిజానికి ఆయన సుప్రీంలీడర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ప్రజల ముందుకు, మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు విడుదల చేసిన వీడియో కూడా ఎప్పటిదనేది స్పష్టత లేదు.

Updated Date - Mar 21 , 2026 | 04:02 AM