Share News

మా షరతులకు అంగీకరించే వరకూ చర్చల్లేవు: ఇరాన్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:16 AM

యుద్ధానికి ముగింపు పలికే విషయంలో తమ ఏడు షరతులకు అంగీకరించే వరకూ అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్‌ పునరుద్ఘాటించింది.

మా షరతులకు అంగీకరించే వరకూ చర్చల్లేవు: ఇరాన్‌

దుబాయ్‌, నవంబరు 24: యుద్ధానికి ముగింపు పలికే విషయంలో తమ ఏడు షరతులకు అంగీకరించే వరకూ అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్‌ పునరుద్ఘాటించింది. ఇరాన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి, పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఘేర్‌ మంగళవారం అక్కడి ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌ పెట్టిన షరతులకు అంగీకరిస్తేనే అమెరికాతో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ శత్రువు తప్పు చేస్తే.. తాము కూడా భౌగోళిక పరిధి దాటి దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఆ ఏడు షరతులు ఏంటన్నవి మాత్రం ఇరాన్‌ అధికారులు బహిరంగంగా వెల్లడించలేదు. ఇరాన్‌ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా నేవీ దిగ్బంధనాన్ని తొలగించడం, సీజ్‌ చేసిన ఆస్తులను విడుదల చేయడం వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. మరోవైపు హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా నేవీ రక్షణలో నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లు నావల్‌ మైన్స్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయని ఐఆర్‌జీసీ సోమవారం టెలిగ్రామ్‌ పోస్టులో పేర్కొంది.

Updated Date - Nov 25 , 2026 | 04:17 AM