Share News

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:51 AM

తమ కుమారుడు యుద్ధ విమాన పైలట్‌ అని, ఇరాన్‌లో యుద్ధానికి వెళ్లిన ఆయన నుంచి స్పందన రావడం లేదంటూ అమెరికాకు చెందిన ఒక మహిళ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు....

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

అమెరికా పైలట్‌ తల్లి ఆవేదనపై ఇరాన్‌ స్పందన

దుబాయ్‌, ఏప్రిల్‌ 4: తమ కుమారుడు యుద్ధ విమాన పైలట్‌ అని, ఇరాన్‌లో యుద్ధానికి వెళ్లిన ఆయన నుంచి స్పందన రావడం లేదంటూ అమెరికాకు చెందిన ఒక మహిళ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తీవ్ర ఆందోళనగా ఉందని, తన కుమారుడు భద్రంగా ఉండాలని ప్రార్థించాలని పేర్కొన్నారు. దీనిపై పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాలోని ఇరాన్‌ ఎంబసీలు స్పందించాయి. ‘‘మీ కుమారుడు ఇరాన్‌ కస్టడీలో ఉండటం కంటే ట్రంప్‌ వద్ద ఉండటమే ఎక్కువ ప్రమాదకరం. అమెరికా రెస్క్యూ బృందాలకు దొరకడం కంటే ఇరాన్‌ కస్టడీలో ఉండాలని కోరుకోండి. మాది ఎంతో వృద్ధి చెందిన నాగరికత. మేం అమెరికా తరహాలో రాతియుగంలో బతకడం లేదు. వారు గొప్పగా చెప్పుకొనే మానవతా చట్టాలను రూపొందించడానికి ఎంతోకాలం ముందే.. యుద్ధ ఖైదీల హక్కులు, వారి విషయంలో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడాన్ని ఇరాన్‌ అమలు చేసింది..’’ అని పేర్కొన్నాయి.

Updated Date - Apr 05 , 2026 | 06:51 AM