అణు కార్యక్రమాన్ని వదిలేసేందుకు సిద్ధం!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:14 AM
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కీలక ప్రకటన చేసిందంటూ గురువారం మీడియాలో వచ్చిన ఓ వార్తతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇరాన్ విదే శాంగ ఉప మంత్రి అన్నట్లు వార్తలు ఆ ప్రతిపాదన యుద్ధానికి ముందు నాటిదన్న ఇరాన్
న్యూఢిల్లీ, మార్చి5: అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కీలక ప్రకటన చేసిందంటూ గురువారం మీడియాలో వచ్చిన ఓ వార్తతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ దేశ భద్రతకు అమెరికా తగిన ప్రత్యామ్నాయాన్ని చూపితే.. అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకొనేందుకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి మాజిద్ తక్త్ రవాంచి అన్నట్లు స్కైన్యూస్ అరేబియా గురువారం పేర్కొంది. దీంతో యుద్ధం త్వరలోనే ముగియవచ్చని మీడియాలో భారీగా కథనాలు వచ్చా యి. అయితే, ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. ఆ ప్రతిపాదన యుద్ధం మొదలు కాకముందు జెనీవాలో జరిగిన చర్చల నాటిదని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఇర్నా వివరణ ఇచ్చింది. కాగా, స్కైన్యూస్ వార్త ప్రభావం అమెరికా డాలర్‌పై బలంగానే పడింది. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డాలర్ విలువ 0.1 శాతం పడిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) బెంచ్‌మార్క్ ముడి చమురు ధర 0.5ు తగ్గి గురువారం బ్యారెల్‌కు 75.70డాలర్ల వద్ద ముగిసింది. ప్రయోగాలను చేసినట్టు అమెరికా స్పేస్ ఫోర్స్ తెలిపింది. అమెరికాకు ఉన్న అణ్వాయుధాల్లో ఇదే అత్యంత విధ్వంసకరమైనదని భావిస్తున్నారు. ఏ దేశమైనా అణుబాంబును ప్రయోగిస్తే తక్షణమే దాన్ని అడ్డుకునేలా రూపొందించారు. భూగర్భంలోని ఆయుధ నిల్వ కేంద్రాల నుంచి నిమిషాల వ్యవధిలో ప్రయోగించే వీలుంది.