ఇరాన్ భారజల కేంద్రం పూర్తిగా ధ్వంసం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:01 AM
మధ్య ఇరాన్‌లో ఉన్న ఖొందబ్ భారజల కేంద్రం అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ..
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడి
వియన్నా, మార్చి30: మధ్య ఇరాన్‌లో ఉన్న ఖొందబ్ భారజల కేంద్రం అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ఈ కేంద్రంపై వైమానిక దాడి జరిగిందని ఐఏఈఏకు ఈ నెల 27న ఇరాన్ తెలిపింది. వైమానిక దాడిలో అది పూర్తిగా ధ్వంసమైందని, తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశాలు లేవని ఐఏఈఏ వెల్లడించింది. ఉపగ్రహ చిత్రాల స్వతంత్ర అధ్యయనం ద్వారా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఇరాన్ ఇక్కడే శుద్ధిచేసిన యురేనియంను నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, దాడి తర్వాత ఈ కేంద్రం నుంచి అణు ధార్మికత వెలువడలేదని ఐఏఈఏకు ఇరాన్ తెలిపింది.