హొర్ముజ్ దాటేందుకు..కొన్ని దేశాల నౌకలను అనుమతించాం
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:01 AM
హోర్ముజ్ జలసంధి దాటేందుకు కొన్ని దేశాల నౌకలకు అనుమతి ఇచ్చామని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మాజిద్ తఖ్త్ రవంచి తెలిపారు.
మాపై దాడులకు సహకరించిన దేశాల నౌకలను మాత్రం వదలబోం: ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి
దుబాయ్, మార్చి 12: హోర్ముజ్ జలసంధి దాటేందుకు కొన్ని దేశాల నౌకలకు అనుమతి ఇచ్చామని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మాజిద్ తఖ్త్ రవంచి తెలిపారు. ‘‘తమ నౌకలు హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కొన్ని దేశాలు మమ్మల్ని సంప్రదించాయి. వారికి మేం సహకరించాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌పై దాడికి సహకరించిన, మద్దతిచ్చిన దేశాల నౌకలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ఏఎ్‌ఫపీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలో ‘సీమైన్స్ (సముద్రపు మందుపాతరలు)’ అమర్చుతున్న ఇరాన్ మైన్‌లేయింగ్ బోట్లను ధ్వంసం చేశామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ఎలాంటి సీమైన్లను అమర్చడం లేదని పేర్కొన్నారు.