Share News

అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు 40వేల కోట్ల నష్టం

ABN , Publish Date - May 03 , 2026 | 04:13 AM

తమ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఆయిల్‌ ఆదాయంలో ఇరాన్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. 4.8 బిలయన్‌ డాలర్లు..

అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు 40వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ, మే 2: తమ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఆయిల్‌ ఆదాయంలో ఇరాన్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. 4.8 బిలయన్‌ డాలర్లు (సుమారు రూ. 40 వేల కోట్లు) నష్టం వచ్చినట్లు పెంటగాన్‌ అంచనా వేసిందని యాక్సియాన్‌ నివేదిక పేర్కొంది. దిగ్బంధనం అమలు సందర్భంగా రెండు ట్యాంకర్లను అమెరికా నేవీ స్వాధీనం చేసుకుంది. 53 మిలియన్‌ బ్యారెళ్లతో నిండి ఉన్న సుమారు 31 చమురు ట్యాంకర్లు ప్రస్తుతం గల్ఫ్‌లో చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. యూఎస్‌ నేవీ అడ్డుగా ఉండటంతో చైనాకు ఆయిల్‌ సరఫరా చేయడానికి ఖరీదైన, సుదూరమైన మార్గాలను కొన్ని నౌకలు ఎంచుకున్నట్లు వారు చెప్పారు. కాగా, శాశ్వత ఒప్పందం కోసం ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో ఆ దేశ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనాన్ని విధించిన విషయం తెలిసిందే.

Updated Date - May 03 , 2026 | 04:13 AM