Share News

సౌదీలో థాడ్‌ రాడార్‌ ధ్వంసం

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:21 AM

యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌లో కీలకమైన అమెరికన్‌ ఏఎన్‌/టీపీవై-2 రాడార్‌ను ఇరాన్‌ క్షిపణులతో ధ్వంసం చేసింది.

సౌదీలో థాడ్‌ రాడార్‌ ధ్వంసం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 3: యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌లో కీలకమైన అమెరికన్‌ ఏఎన్‌/టీపీవై-2 రాడార్‌ను ఇరాన్‌ క్షిపణులతో ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి తాజాగా శాటిలైట్‌ చిత్రాలు బయటికి వచ్చాయి. బాలిస్టిక్‌ క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసే అమెరికన్‌ థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఈ రాడార్‌ కీలక భాగం. ఈ రాడార్‌ విలువ సుమారు రూ.1,261 కోట్లు (136 మిలియన్‌ డాలర్లు). సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొస్తున్న శత్రుదేశ క్షిపణులను గుర్తించే సామర్థ్యం దీని సొంతం. ఈ రాడార్‌ ధ్వంసం కావడంతోనే ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్లో అమెరికా వ్యవస్థలకు వరుస నష్టాలు సంభవించాయి. మొదట ఐదు కేసీ-135 ట్యాంకర్‌ విమానాలు, ఇటీవల ఒక ఈ-3 అవాక్స్‌ విమానం, మరో ట్యాంకర్‌ విమానం, ఇతర వ్యవస్థలు ధ్వంసం కావడం, 12 మంది సైనికులు గాయపడటం వంటివి జరిగాయని భావిస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:21 AM