Share News

అమెరికా ఆస్పత్రులపై ఇరాన్‌ సైబర్‌ దాడి..!

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:45 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఇప్పుడు సైబర్‌ వార్‌కి దారి తీసింది. అమెరికాకు చెందిన వైద్య సాంకేతికత దిగ్గజ సంస్థ ‘స్ట్రయికర్‌’పై ఇరాన్‌ అనుబంధ హ్యాకర్ల బృందం దాడి చేసింది.

అమెరికా ఆస్పత్రులపై ఇరాన్‌ సైబర్‌ దాడి..!

  • స్తంభించిన కంప్యూటర్లు.. ఆరోగ్యరంగంపై ప్రభావం

వాషింగ్టన్‌, మార్చి 12: అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఇప్పుడు సైబర్‌ వార్‌కి దారి తీసింది. అమెరికాకు చెందిన వైద్య సాంకేతికత దిగ్గజ సంస్థ ‘స్ట్రయికర్‌’పై ఇరాన్‌ అనుబంధ హ్యాకర్ల బృందం దాడి చేసింది. దీంతో ఆ కంపెనీ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. 2 లక్షలకుపైగా కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు నిలిచిపోయాయి. 50 టెరాబైట్ల డేటా చోరీకి గురైంది. ఈ దాడికి ‘హండాలా’ అనే హ్యాకర్ల బృందం కారణమని తెలిసింది. అమెరికాలోని ఆస్పత్రుల పనితీరుపై ఈ దాడి తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే అమెరికాలోని చాలా ఆస్పత్రులు స్ట్రయికర్‌ అందించే వైద్య పరికరాలు, డిజిటల్‌ టెక్నాలజీపైనే ఆధారపడతున్నాయి. శస్త్రచికిత్సలు, ప్రత్యేక చికిత్సల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రోగులపైనా ఈ ప్రభావం పడింది. ఈ సైబర్‌ దాడి అమెరికా హెల్త్‌కేర్‌ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్‌ రంగంలో స్ట్రయికర్‌కు అత్యధిక మార్కెట్‌ ఉండడంతో.. ఇప్పటికే ఖరారైన తుంటి ఆపరేషన్లు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Mar 13 , 2026 | 03:45 AM