Share News

భారతీయ మిత్రులకు ముప్పు ఉండదు: ఇరాన్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:05 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ.. భారతీయుల భద్రతకు ఇరాన్‌ భరోసా ఇచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్‌ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్‌ నొక్కి చెబుతున్న....

భారతీయ మిత్రులకు ముప్పు ఉండదు: ఇరాన్‌

టెహ్రాన్‌, ఏప్రిల్‌ 2: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ.. భారతీయుల భద్రతకు ఇరాన్‌ భరోసా ఇచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్‌ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్‌ నొక్కి చెబుతున్న తరుణంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయుల భద్రతకు భరోసా ఇస్తూ ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. ‘మా భారతీయ మిత్రులకు ముప్పేమీ ఉండదు. ఆందోళన అవసరం లేదు’ అని ఇరాన్‌ రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. కాగా, సరకు రవాణా నౌకలకు కీలకమైన జలమార్గం హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ(ది ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌) తోసిపుచ్చింది. ఆ జలమార్గం తమ పూర్తి నియంత్రణలోనే ఉందని ఐఆర్‌జీసీ ప్రకటించింది.

Updated Date - Apr 03 , 2026 | 04:05 AM