Share News

దౌత్యానికి తలుపులు..పూర్తిగా మూసుకున్నాయి: అరాగ్చీ

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:36 AM

తమ దేశంలోని భారీ వంతెనను అమెరికా పేల్చివేయడంపై ఇరాన్‌ తీవ్రంగా మండిపడింది. ఇది అమెరికా నైతిక పతనానికి, ఓటమితో నెలకొన్న అసహనానికి సాక్ష్యమని పేర్కొంది.

దౌత్యానికి తలుపులు..పూర్తిగా మూసుకున్నాయి: అరాగ్చీ

దుబాయ్‌, ఏప్రిల్‌ 3: తమ దేశంలోని భారీ వంతెనను అమెరికా పేల్చివేయడంపై ఇరాన్‌ తీవ్రంగా మండిపడింది. ఇది అమెరికా నైతిక పతనానికి, ఓటమితో నెలకొన్న అసహనానికి సాక్ష్యమని పేర్కొంది. దాడులు చేయబోమని హామీ ఇచ్చి, ఇలా మోసం చేయడం చేదు అనుభవమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పేర్కొన్నారు. అమెరికాతో చర్చలు అనే అంశంపై ఇకపై పూర్తిగా ముగిసిపోయినట్టేనని స్పష్టం చేశారు. ‘‘అమెరికాతో ఇక ఎన్నటికీ, ఎలాంటి చర్చలకు అవకాశం ఉండదు. దౌత్యానికి తలుపులు ఇక పూర్తిగా మూసుకుపోయినట్టే. చర్చల ప్రక్రియలో పురోగతి ఉన్న సమయంలో ఇలా దాడులకు తెగబడ్డారు. ఉన్న విశ్వాసం పూర్తిగా పోయింది’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:36 AM