Share News

బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:27 AM

దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. బహ్రెయిన్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకు పడింది.

బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

బహ్రెయిన్‌, నవంబరు 22: దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. బహ్రెయిన్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకు పడింది. బహ్రెయిన్‌లోని అల్‌-రిఫా, అవాలి ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తమ ఏరోస్పేస్‌ దళం ఈ దాడులు చేసినట్టు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. అమెరికా తమ గగన తలంలోకి చొరబడి, అదే పనిగా చేస్తున్న దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేసినట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. బహ్రెయిన్‌లోని షేక్‌ ఇసా, జుఫెయిర్‌ అమెరికా సైనిక స్థావరాలపైనా ఐఆర్‌జీసీ దళాలు దాడులు చేసినట్టు ఇరాన్‌ ఫార్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌ తమ దేశంలోని ఒక పారిశ్రామిక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు బహ్రెయిన్‌ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Updated Date - Nov 23 , 2026 | 03:32 AM