Beggar Turns Crorepati: ఇండోర్ బిచ్చగాడు కోట్లాధిపతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:23 AM
క్లీన్ సిటీ ఇండోర్‌లో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం సరాఫా బజార్. ఒక్కడ నాలుగు చక్రాలున్న చెక్కపై కూర్చుని, చేతులకున్న బూట్లతో బండిని తోసుకుంటూ దీనంగా చూసే మంగీలాల్‌ను చూసి కరిగిపోయి డబ్బులు వేసే వాళ్లు ఎంతో మంది.
ఇండోర్, జనవరి 19: క్లీన్ సిటీ ఇండోర్‌లో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం సరాఫా బజార్. ఒక్కడ నాలుగు చక్రాలున్న చెక్కపై కూర్చుని, చేతులకున్న బూట్లతో బండిని తోసుకుంటూ దీనంగా చూసే మంగీలాల్‌ను చూసి కరిగిపోయి డబ్బులు వేసే వాళ్లు ఎంతో మంది. కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటున్న అతను కోట్లకు అధిపతి అని తెలియడంతో అనేక మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న అధికారులకు అతనిపై అనేక ఫిర్యాదుల అందాయి. ఈ నేపథ్యంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంగీలాల్‌ను మానవ అక్రమ రవాణా బాధితుడిగా గుర్తించి సరాఫా బజార్ నుంచి రక్షించి, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించింది. విచారణలో బయటపడ్డ వాస్తవాలు చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. బిచ్చగాడు మంగీలాల్ వాస్తవంగా కోట్లకు అధిపతి. అతనికి మూడు స్వంత ఇళ్లు ఉన్నాయి. అవి రూ.కోటి వరకూ విలువ చేస్తాయి. అద్దెకు ఇవ్వడానికి మూడు ఆటోలు, ఒక విలాసవంతమైన కారు ఉన్నాయి. రోజూ తనకు వచ్చిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు.