Share News

రష్యా సైన్యంలో ఉన్న ఆ భారతీయుడ్ని తీసుకురాలేం

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:49 AM

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారత మూలాలు ఉన్న సైనికుడిని తిరిగి తీసుకొచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువని సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

రష్యా సైన్యంలో ఉన్న ఆ భారతీయుడ్ని తీసుకురాలేం

  • ఆ దేశ పౌరసత్వం తీసుకోవడమే కారణం: కేంద్రం

న్యూఢిల్లీ, నవంబరు 24: రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారత మూలాలు ఉన్న సైనికుడిని తిరిగి తీసుకొచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువని సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ వ్యక్తి భారత్‌ పౌరసత్వాన్ని వదిలి రష్యా పౌరసత్వాన్ని తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిపింది. రష్యా సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో పాల్గొంటున్న తన కుమారుడిని తిరిగి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఆయన తండ్రి చేసిన వినతిపై విచారణ జరిపిన ధర్మాసనానికి ఈ విషయాన్ని తెలిపింది.

Updated Date - Nov 25 , 2026 | 03:50 AM