ఆర్టెమిస్-2 విజయం వెనుక భారత సంతతి వ్యక్తి
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:34 AM
ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతం కావడంలో భారత సంతతి ఇంజనీర్ అమిత్ క్షత్రియ కీలక పాత్ర పోషించారు. అమిత్ ప్రస్తుతం నాసాలో...
వాషింగ్టన్, ఏప్రిల్ 11: ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతం కావడంలో భారత సంతతి ఇంజనీర్ అమిత్ క్షత్రియ కీలక పాత్ర పోషించారు. అమిత్ ప్రస్తుతం నాసాలో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది నాసాలో ఒక సివిల్ సర్వెంట్‌కు లభించే అత్యున్నత స్థాయి పదవి. గతంలో ఆయన నాసా ‘మూన్ టూ మార్స్’ ప్రోగ్రామ్ మొదటి అధిపతిగా బాధ్యతలు నిర్వహించి, అంగారక గ్రహంపైకి మానవ యాత్రలకు పునాదులు వేశారు. 2003లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నాసాలో చేరిన అమిత్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎ్‌సఎస్) ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా నాసా ‘అవుట్‌స్టాండింగ్ లీడర్‌షిప్ మెడల్’తో సత్కరించింది.