అమెరికాలో హత్య..జర్మనీలో భారతీయుడి అరెస్టు
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:10 AM
అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న భారతీయుడిని బెర్లిన్‌లో జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు.
వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న భారతీయుడిని బెర్లిన్‌లో జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. అరిజోనా వర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ కోర్సు చదువుతున్న వరుణ్ బచ్చిగారిపై మర్డర్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. టస్కన్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో నివసించే అతడి గర్ల్‌ఫ్రెండ్ జులిస్సా రూబీ సలజార్(19) ఈ నెల 6న మరణించింది. ఇది వరుణ్ పనేనని భావించి.. పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. ఈలోగా అతడు టస్కన్ నుంచి బెర్లిన్‌కు పారిపోయాడు. పోలీసులు వారెంటు జారీ చేయడంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.