Share News

మచ్చార్‌కు ఇజ్రాయెల్‌ ప్రెసిడెన్షియల్‌ అవార్డు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:55 AM

‘ఇజ్రాయెల్‌, భారత్‌లకే కాదు.. సమస్త మానవాళికి మీరు హీరో’ అంటూ భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ ప్రశంసలు కురిపించారు.

మచ్చార్‌కు ఇజ్రాయెల్‌ ప్రెసిడెన్షియల్‌ అవార్డు

  • ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ ప్రకటన.. మచ్చార్‌కు లేఖ

టెల్‌ అవీవ్‌, అక్టోబరు 11: ‘ఇజ్రాయెల్‌, భారత్‌లకే కాదు.. సమస్త మానవాళికి మీరు హీరో’ అంటూ భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ ప్రశంసలు కురిపించారు. సెప్టెంబరు 30న ఇజ్రాయెల్‌కు వెళ్లే ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చివేసేందుకు కోపైలట్‌ పన్నిన కుట్రను భగ్నం చేసిన స్మిత్‌ను.. గాయాల నుంచి కోలుకున్నాక జెరూసలేంలో ‘ఇజ్రాయెల్‌ ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం’తో సత్కరించనున్నట్టు ఇసాక్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో ప్రకటించారు. స్మిత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..ఈనెల 4న ఆయనకు లేఖ రాశానని పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్నాక జెరూసలెంకు రావాలని స్మిత్‌ను ఆయన ఆహ్వానించారు. కాగా, ఫ్లైదుబాయ్‌ విమానంలో కోపైలట్‌ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆరుగురు ఇజ్రాయెల్‌ ప్రయాణికులను ‘ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం’తో ఇసాక్‌ సత్కరించారు.

Updated Date - Oct 12 , 2026 | 04:57 AM