Share News

మీ ఫోన్లలో యుద్ధ వీడియోలను తొలగించండి

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:33 AM

ప్రస్తుత ఉద్రిక్త పరిస్ధితుల్లో గల్ఫ్‌ దేశాల్లో యుద్ధానికి సంబంధించిన ఏ రకమైన అనధికార సమాచారం లేదా వీడియోలు, ఫొటోలను సెల్‌ఫోన్లలో ఉంచకూడదని...

మీ ఫోన్లలో యుద్ధ వీడియోలను తొలగించండి

  • ప్రవాసులకు భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ సూచన

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ప్రస్తుత ఉద్రిక్త పరిస్ధితుల్లో గల్ఫ్‌ దేశాల్లో యుద్ధానికి సంబంధించిన ఏ రకమైన అనధికార సమాచారం లేదా వీడియోలు, ఫొటోలను సెల్‌ఫోన్లలో ఉంచకూడదని, వాటిని వెంటనే తొలగించాలని యూఏఈలోని భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ ప్రవాసులకు విజ్ఞప్తి చేశారు. దుబాయ్‌లోని భారతీయ కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌తో కలిసి యూఏఈలోని ప్రవాసీ ప్రముఖులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని వాట్సా్‌పలో ఫార్వర్డ్‌ చేసిన భారతీయులను పోలీసులు అరెస్టు చేసిన ఘటనలను పలువురు ప్రస్తావించగా.. దీపక్‌మిట్టల్‌ స్పందించారు. యుద్ధానికి సంబంధించిన అనధికార సమాచారం ఫోన్లలో ఉంటే.. నేరంగా పరిగణించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దుబాయ్‌ నుంచి తిరిగి వెళ్తూ విమానాశ్రయంలో ఒక వీడియోను రికార్డ్‌ చేసి, షేర్‌ చేసిన బ్రిటన్‌ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రెండేళ్ల జైలు శిక్ష పడిందని బ్రిటన్‌ పత్రికలు వెల్లడించాయి.

Updated Date - Mar 16 , 2026 | 03:33 AM