ఖమేనీ హత్యపై మౌనం వీడండి
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:34 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై మౌనం వీడాలని, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రపంచ దేశాలకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది.
ప్రపంచ దేశాలకు భారత్‌లోని ఇరాన్ ఎంబసీ పిలుపు
న్యూఢిల్లీ, మార్చి 1: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై మౌనం వీడాలని, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రపంచ దేశాలకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ధ్రువీకరించింది. ఈ ఘటనపై తీవ్ర సంతాపం, దిగ్ర్భాంతిని వ్యక్తం చేసిన భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం.. ఈ ఘోరాన్ని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోరుకునే దేశాలు తీవ్రంగా ఖండించాలని, ఈ చట్టవిరుద్ధ దాడులపై మౌనం వీడాలని పేర్కొంది. ఈ క్షమించరాని నేరానికి అమెరికా, ఇజ్రాయెల్‌లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఆ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేపట్టినట్లు తెలిపింది.