మరణ శిక్ష నిషేధానికి వ్యతిరేకంగా యూఎన్‌లో భారత్ ఓటు
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:28 AM
మరణ శిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది.
193 సభ్య దేశాల్లో 133 అనుకూలం
న్యూయార్క్, నవంబరు 15: మరణ శిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. మెక్సికో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఇటీవల ఐరాసలో ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా.. మొత్తం 193 సభ్య దేశాలకు 182 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 133 దేశాలు తీర్మానానికి అనుకూలంగా, 33 దేశాలు వ్యతిరేకంగా ఓటేయగా.. మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ప్రతి సార్వభౌమ దేశానికి సొంత న్యాయ వ్యవస్థను, నేరాలకు తగిన శిక్షలను నిర్ణయించుకునే హక్కు ఉందని భారత్ స్పష్టం చేసింది. మరణ శిక్షపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం లేదని.. భారత న్యాయ వ్యవస్థలో కఠిన విచారణ ప్రక్రియ తర్వాతే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తారని వెల్లడించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, చైనా, అమెరికా, జపాన్, ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, మాల్దీవులు, ఒమన్ తదితర దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.