భారత్-ఈయూ ఎఫ్‌టీఏతో 90 శాతానికిపైగా ఇండియా ఎగుమతులపై సుంకాలుండవ్!
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:44 AM
భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 24: భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఈ చర్చలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరితే మనదేశం నుంచి ఈయూకు వెళ్లే 90 శాతానికి పైగా ఉత్పత్తులపై ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా అనుమతించవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. భారత రైతుల ప్రయోజనాలను కాపాడటానికి డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులను దీని నుంచి మినహాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... వచ్చే వారంలో జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో రెండింటి మధ్య భాగస్వామ్యం కొత్త దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించడంతోపాటు కొత్త రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని భారత్, ఈయూ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.