Share News

సంయమనం పాటించి ఘర్షణలు నివారించండి

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:06 AM

ఇరాన్‌, గల్ఫ్‌ దేశాల్లో ఘర్షణలు నానాటికీ ముదురుతుండడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించి పరిస్థితి తీవ్రం కాకుండా చూడాలని అన్ని పక్షాలను కోరింది.

సంయమనం పాటించి ఘర్షణలు నివారించండి

  • పశ్చిమాసియా పరిస్థితిపై భారత్‌ అధికారిక స్పందన

న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్‌, గల్ఫ్‌ దేశాల్లో ఘర్షణలు నానాటికీ ముదురుతుండడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించి పరిస్థితి తీవ్రం కాకుండా చూడాలని అన్ని పక్షాలను కోరింది. సామాన్య పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పవిత్ర రమదాన్‌ మాసంలో ఉద్రిక్తతలు నెలకొని, శాంతి భద్రతలు క్షీణిస్తుండడంపై ఆవేదన చెందింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. యుద్ధం తీవ్రతరమై, ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు, విఽధ్వంసాలు, మరణాలు అధికమవుతున్నట్టు పేర్కొంది. గల్ఫ్‌లో దాదాపు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని, వారి భద్రతే తమకు ప్రధానమని తెలిపింది. వారిపై ప్రతికూలత చూపే పరిణామాలపై ఉదాసీనంగా ఉండలేమని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

Updated Date - Mar 04 , 2026 | 04:06 AM