నాకు వైద్యం అందేలా చూడండి: ఇమ్రాన్ ఖాన్
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:12 AM
తనకు, తన భార్య బుష్రాబీబీకి వైద్యం అందేలా చూడాలని కోరుతూ పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ తమదేశ అత్యున్నత న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు.
ఇస్లామాబాద్, నవంబరు 16: తనకు, తన భార్య బుష్రాబీబీకి వైద్యం అందేలా చూడాలని కోరుతూ పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ తమదేశ అత్యున్నత న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. తన ఆరోగ్యం క్షీణిస్తోందని, ప్రాణానికి ముప్పుగా పరిణమించనుందని పేర్కొన్నారు. తనకు వైద్యం అందించేలా గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరారు. సుప్రీంకోర్టు, ఫెడరల్ రాజ్యాంగ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఉద్దేశించి రాసిన ఈ లేఖను ఇమ్రాన్‌ఖాన్ లాయర్ సల్మాన్ సఫ్దర్ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గతవారమే అడియాలా జైల్లో ఇమ్రాన్‌ఖాన్‌ను సల్మాన్ సఫ్దర్ కలిశారు. ఇమ్రాన్‌ఖాన్ వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. వివిధ అవినీతి కేసుల నేపథ్యంలో 2023 నుంచి ఆయన జైల్లో ఉన్నారు. అలాగే, బుష్రాబీబీ 2025లో ఒక అవినీతి కేసులో అరెస్టయ్యారు.