Share News

హోర్ముజ్‌లో చమురు నౌకపై దాడి

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:23 AM

హోర్ముజ్‌ జలసంధిలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న ఒక చమురు నౌకపై క్షిపణి దాడి జరిగింది.

హోర్ముజ్‌లో చమురు నౌకపై దాడి

  • ఐదుగురు భారతీయులను రక్షించిన ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌

దుబాయ్‌, అక్టోబరు 3: హోర్ముజ్‌ జలసంధిలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న ఒక చమురు నౌకపై క్షిపణి దాడి జరిగింది. కువైట్‌ పతాకంతో టోగోలోని లోమెకు వెళ్తున్న ఎంటీ కజిమా-2 అనే చమురు నౌకపై శుక్రవారం క్షిపణి దాడి జరిగింది. వెంటనే స్పందించిన ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ సహాయంతో ఆ నౌకలోని ఐదుగురు భారతీయ సిబ్బందిని రక్షించింది. ఈ నౌకపై ఎవరు దాడిచేశారన్నది తెలియలేదు.

Updated Date - Oct 04 , 2026 | 06:49 AM