Share News

38శాతం పడిపోయిన హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - May 23 , 2026 | 04:00 AM

కఠినమైన ఇమిగ్రేషన్‌ నిబంధనలు, లాటరీ విధానం మార్పు తదితర కారణాలతో ఈ ఏడాది అమెరికా హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి.

38శాతం పడిపోయిన హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు

వాషింగ్టన్‌, మే 22: కఠినమైన ఇమిగ్రేషన్‌ నిబంధనలు, లాటరీ విధానం మార్పు తదితర కారణాలతో ఈ ఏడాది అమెరికా హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్‌-1బీ వీసా సీజన్‌ నమోదు వివరాలను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్సీఐఎస్‌) తాజాగా విడుదల చేసింది. గత 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు కాగా, ఈ ఏడాది ఏకంగా 38.5శాతం తగ్గి, దాదాపు 2,11,600కు పడిపోయింది. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థుల కూర్పులో కూడా గణనీయంగా మార్పు కనిపించింది. ఈ ఏడాది ఎంపిక చేసిన 71.5శాతం రిజిస్ట్రేషన్లు.. అమెరికా మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకుముందు మించి విద్యార్హత ఉన్న దరఖాస్తులవి కాగా, గతేడాది ఈ సంఖ్య 57 శాతంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు, అధిక వేతనాలు, ప్రధానంగా అమెరికా వర్సిటీల్లో చదివిన వారి దరఖాస్తులను ఎక్కువగా ఆమోదిస్తున్నామని యూఎ్‌ససీఐఎస్‌ పేర్కొంది.

Updated Date - May 23 , 2026 | 04:00 AM