Share News

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:32 AM

అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది.

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ విడుదల

  • మార్చి 4 నుంచి 19 వరకు గడువు

  • 31న ఎంపిక జాబితా ప్రకటన

  • రిజిస్ట్రేషన్‌కు 215 డాలర్లు

  • ఎంపికైతే లక్ష డాలర్లు చెల్లించాల్సిందే

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 2: అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. ఈ వీసా కోటా కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 4న ప్రారంభమవుతుందని, 19తో ముగుస్తుందని పేర్కొంది. దరఖాస్తుదారు యూఎ్‌ససీఐఎస్‌ ఆన్‌లైన్‌ ఖాతా లో రిజిస్టర్‌ చేసుకొని 215 డాలర్లు సుమారు రూ.18,000 ప్రాథమిక రుసుము కింద చెల్లించాలి. 19వ తేదీ గడువు ముగిసిన తరువాత మార్చి 31 నాటికి ఎంపికైన వారికి ఈమెయిల్స్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ వీసా కోసం తప్పనిసరిగా యూఎ్‌ససీఐఎస్‌ ఆన్‌లైన్‌ ఖాతా ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఖాతా లేని కంపెనీలు తప్పనిసరిగా అక్కౌంట్‌ను తెరవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ముందుగానే పూర్తి చేసి ఉంచుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్‌ ఫీజు మాత్రం మార్చి 4 నుంచి మాత్రమే చేయాలి. ‘కొత్త నిబంధనల ప్రకారం అత్యధిక నైపుణ్యం కలిగిన, ఎక్కువ జీతం తీసుకునే వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల అమెరి కా పౌరుల ఉద్యోగిత హక్కుకు రక్షణ ఉంటుంది’ అని యూఎ్‌ససీఐఎస్‌ పేర్కొంది. మొదటి దశలో ఎంపికయిన వారికి హెచ్‌-1బీ పిటిషన్‌ దాఖలు చేసేటపుడు అర్హత ఉన్న కంపెనీలు లక్ష డాలర్లు సుమారు రూ.84 లక్షలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Feb 03 , 2026 | 02:32 AM