Share News

నెతన్యాహుది ఏఐ డీప్‌ఫేక్‌ వీడియో అన్న గ్రోక్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:35 AM

ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరణించారని వార్తలు ఊపందుకున్న వేళ.. వాటిని ఖండిస్తూ ఆయన రెండు రోజుల క్రితం విడుదల చేసిన వీడియో.....

నెతన్యాహుది ఏఐ డీప్‌ఫేక్‌ వీడియో అన్న గ్రోక్‌

జెరూసలేం, మార్చి 16: ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరణించారని వార్తలు ఊపందుకున్న వేళ.. వాటిని ఖండిస్తూ ఆయన రెండు రోజుల క్రితం విడుదల చేసిన వీడియో నకిలీదనే వాదనలు మొదలయ్యాయి. ఆ వీడియోలో నెతన్యాహు ఓ కాఫీ షాపులో కాఫీ తాగుతూ.. ‘అవును నేను చనిపోయాను.. కాఫీ కోసం’ అని సెటైర్‌ వేస్తూ కనిపించారు. ఈ వీడియో నిజమైనదా, కాదా? అని ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ గ్రోక్‌ను కొందరు అడగ్గా.. అది డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో రూపొందించిన సెటైరిక్‌ వీడియో అని తెలిపింది. ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడిన మాటలకు, ఆయన పెదవుల కదలికలకు పొంతన కుదరలేదని పేర్కొంది. ఆయన చేతిని అటూ ఇటూ ఊపుతున్నా.. ఆ చేతిలోని కాఫీ కప్పులో కాఫీ కదలకుండా ఉందని.. వీటన్నింటిని బట్టి చూస్తే అది ఏఐ వీడియో అని వెల్లడించింది. అయితే, గ్రోక్‌ ఏఐ వీడియో అని చెప్పిన కొన్ని గంటల్లోనే నెతన్యాహు సోమవారం మరో వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన పంటపొలాల్లో మహిళలతో మాట్లాడుతూ కనిపించారు.

Updated Date - Mar 17 , 2026 | 03:35 AM