Share News

గ్రీస్‌లో విద్యార్థుల ఆందోళనలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:58 AM

విద్యావ్యవస్థలో సంస్కరణలను కోరుతూ గ్రీస్‌లో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చారు. విద్యారంగానికి బడ్జెట్‌ పెంచాలని, మరిన్ని ప్రభుత్వ బడులు నిర్మించాలని..

గ్రీస్‌లో విద్యార్థుల ఆందోళనలు

న్యూఢిల్లీ, అక్టోబరు 21: విద్యావ్యవస్థలో సంస్కరణలను కోరుతూ గ్రీస్‌లో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చారు. విద్యారంగానికి బడ్జెట్‌ పెంచాలని, మరిన్ని ప్రభుత్వ బడులు నిర్మించాలని, క్లాసు రూముల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండటం, దేశవ్యాప్తంగా అద్దెలు భారీగా పెరిగిపోవడం, భారీ కరెంటు చార్జీలపైన కూడా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వేల మందికి పైగా నిరసనకారులు ఏథెన్స్‌ నగరంలో ఆందోళనలు నిర్వహించారు.

Updated Date - Oct 22 , 2026 | 04:59 AM