హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:03 AM
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు యూరప్, ఆసియా దేశాలు చర్చలు జరిపాయి..
లండన్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు యూరప్, ఆసియా దేశాలు చర్చలు జరిపాయి. బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 60 దేశాల నేతలు గురువారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిటన్ ఆహ్వానం మేరకు భారత్ కూడా పాల్గొంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ ఈ భేటీలో పాల్గొని, హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్‌పై దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ జపాన్, యూఏఈ తదితర దేశాలు పాల్గొని.. హోర్ముజ్ జలసంధిని తెరిచి నౌకా రవాణాకు సహకరించాలని ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి.