Share News

ఇటలీని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మెలోని రికార్డు

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:21 AM

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు.

ఇటలీని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మెలోని రికార్డు

  • మోదీ అభినందనలు.. మెలోని కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక మైలురాయి ఇటలీ ప్రజలకు ఆమె నాయకత్వంపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని ప్రశంసించారు. మోదీ ట్వీట్‌కు మెలోని రీ-ట్వీట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ప్రియమైన మోదీ.. మీ ఆత్మీయ వ్యాఖ్యలకు, అమూల్యమైన స్నేహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఆమె తన సందేశాన్ని పంచుకున్నారు. 2022 అక్టోబర్‌ 22న ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోని, 1,413 రోజుల పాటు అధికారంలో కొనసాగి ఆ దేశ మాజీ ప్రధాని బెర్లుస్కోనీ పేరిట ఉన్న రికార్డు (1,412)ను అధిగమించారు.

Updated Date - Sep 05 , 2026 | 05:22 AM