Share News

10 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:06 AM

అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ జీ7 కూటమి చల్లని కబురు చెప్పింది. ఈ కూటమిలోని దేశాలన్నీ కలిసి త్వరలోనే 10కోట్ల బ్యారెళ్ల చమురును..

10 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల!

వాషింగ్టన్‌, అక్టోబరు 2: అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ జీ7 కూటమి చల్లని కబురు చెప్పింది. ఈ కూటమిలోని దేశాలన్నీ కలిసి త్వరలోనే 10కోట్ల బ్యారెళ్ల చమురును తమ బఫర్‌ నిల్వల నుంచి విడుదల చేస్తామని ప్రకటించాయి. ఇందులో ఎక్కువ మొత్తం డీజిల్‌ ఉంటుందని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అయితే, వచ్చే నెల 3న అమెరికాలో జరిగే మిడ్‌ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌.. జీ7 దేశాల బఫర్‌ స్టాక్‌ నుంచి చమురును మార్కెట్‌లోకి విడుదల చేయాలని గురువారం కోరారు.

Updated Date - Oct 03 , 2026 | 03:07 AM