Clemence Guette: నాటో నుంచి తప్పుకొందాం..
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:29 AM
నాటో కూటమి నుంచి తప్పుకొందామని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆ దేశ పార్లమెంటు ఉపాధ్యక్షురాలు క్లెమెన్స్ గ్యూటే ప్రతిపాదించారు.
ట్రంప్ విధానాలు దారుణం.. ఫ్రాన్స్ పార్లమెంటు ఉపాధ్యక్షురాలు క్లెమెన్స్ గ్యూటే ప్రతిపాదన
పారిస్, జనవరి 9: నాటో కూటమి నుంచి తప్పుకొందామని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆ దేశ పార్లమెంటు ఉపాధ్యక్షురాలు క్లెమెన్స్ గ్యూటే ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, అందువల్ల అమెరికా ఆధ్వర్యంలోని నాటోలో ఫ్రాన్స్ కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేసింది. పాలస్తీనాలో మారణకాండకు మద్దతిచ్చింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి నుంచి తప్పుకోవాలి’’ అని క్లెమెన్స్ పేర్కొన్నారు.