Share News

ఎండలతో ఫ్రాన్స్‌ విలవిల

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:36 AM

రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఐరోపాను వణికిస్తున్నాయి. గత వారంలో తీవ్రమైన వేడి, వడగాడ్పుల కారణంగా మూడు రోజుల్లోనే...

ఎండలతో ఫ్రాన్స్‌ విలవిల

  • మూడు రోజుల్లోనే 1000 అదనపు మరణాలు

  • ఐరోపాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

బెర్లిన్‌, జూన్‌ 28: రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఐరోపాను వణికిస్తున్నాయి. గత వారంలో తీవ్రమైన వేడి, వడగాడ్పుల కారణంగా మూడు రోజుల్లోనే ఫ్రాన్స్‌లో సుమారు 1000 అదనపు మరణాలు సంభవించాయని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా పారిస్‌ ప్రాంతంలో వైద్య సహాయం కోరుతూ వచ్చిన ఫోన్‌ కాల్స్‌లోనూ గణనీయమైన పెరుగుదల కనిపించిందని పేర్కొంది. దేశ చరిత్రలోనే గత బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అదే రోజు 1200 మరణాలు సంభవించాయని ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫ్రాన్స్‌’ వెల్లడించింది. వడగాడ్పులు మొదలవడానికి ముందు ఫ్రాన్స్‌లో రోజువారీ మరణాల సంఖ్య 900-1000 మధ్యలో ఉండేదని తెలిపింది. కానీ.. బుధవారం 1200 మంది చనిపోగా, ఆ తర్వాతి రెండు రోజుల్లో రోజుకు 1400 మంది చొప్పున మరణించారని పేర్కొంది. కేవలం మూడు రోజుల్లోనే అదనంగా 1000 మరణాలు సంభవించాయని ఆ సంస్థ నిర్ధారించింది. కాగా, మరణించిన వారిలో 85ు మంది 65 ఏళ్లు పైబడినవారేనని పేర్కొంది.

Updated Date - Jun 29 , 2026 | 04:36 AM