ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:41 AM
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కోలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆదివారం తాత్కాలికంగా మూసివేశారు..
మాస్కో, ఫిబ్రవరి 22: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కోలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆదివారం తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాశ్రయాల్లో విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని తెలిపింది.