రష్యా చమురు కొనుగోళ్లు.. భారత్‌కు ఫిన్‌లాండ్ మద్దతు
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:08 PM
రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌కు ఫిన్‌లాండ్ మద్దతుగా నిలిచింది. రష్యా ముడి చమురును ఎవరూ కొనుగోలు చేయకుండా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించలేదని ఫిన్‌లాండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎలీనా వాల్టోనెన్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా ముడి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌కు ఫిన్‌లాండ్ మద్దతుగా నిలిచింది. రష్యా ముడి చమురును ఎవరూ కొనుగోలు చేయకుండా పాశ్చాత్య దేశాలు ఎలాంటి ఆంక్షలనూ విధించలేదని ఫిన్‌లాండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎలీనా వాల్టోనెన్ స్పష్టం చేశారు. ముడి చమురు విక్రయాలతో రష్యా అతిగా లాభపడకుండా ఆంక్షలు విధించామని వివరించారు. ఇందుకోసం రష్యా ముడి చమురు కొనుగోలు ధరపై పరిమితి విధించాల్సి వచ్చిందని ఫిన్‌లాండ్ మంత్రి చెప్పారు. ఈ ధరలకు లోబడే భారత్ రష్యా ముడి చమురును కొనుగోలు చేసిందని అన్నారు. ‘ఆంక్షల సమయంలో రష్యా అధికంగా లాభపడకుండా చూడాలనుకున్నాము. అదే సమయంలో ముడి చమురు మార్కెట్‌లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు తలెత్తకుండా రష్యా ముడి చమురు కొనుగోలు ధరపై పరిమితి విధించాము’ అని చెప్పారు.
ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న కుల్టరాంటా టాక్స్ సమావేశాల్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ఇంధన కొనుగోళ్లను ఆయన సమర్థించుకున్నారు. ఇంధన లభ్యత, ధరల ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రష్యా చమురు విషయంలో భారత్ అనవసర ఉదారత ప్రదర్శించిందన్న ఒక విలేకరి ఆరోపణను తోసిపుచ్చారు.
రష్యాపై 2022లో ఆంక్షలను విధించాక ముడి చమురు మార్కెట్ సమూలమార్పులకు లోనైందని మంత్రి జైశంకర్ తెలిపారు. ఐరోపా దేశాలు పశ్చిమాసియా ముడి చమురు కోనుగోళ్లను పెంచితే ఇతర దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ముడి చమురు మార్కెట్‌లో ధరల స్థిరీకరణ కోసం రష్యా ముడి చమురును కొనాలని యూఎస్ భారత్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించిందని చెప్పారు. ఐరోపాను ప్రమాదంలోకి నెట్టే పనేదీ భారత్ చేయలేదని అన్నారు. కానీ ఐరోపా దేశాల ఆయుధాలు మాత్రం భారత్‌పై దాడికి ఉపయోగపడ్డాయని చురకలు అంటించారు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచిదని గట్టి సమాధానం ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!
భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు బ్రేక్.. భద్రతా అనుమతులపై కేంద్రం సమీక్ష