Share News

ఈయూ బాస్‌..బాబుష్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:15 AM

భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మీడి యా సమావేశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.

ఈయూ బాస్‌..బాబుష్‌

  • ఈయూ బాస్‌..బాబుష్‌తాను భారత సంతతి వ్యక్తినన్న యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటానియో కోస్టా

న్యూఢిల్లీ, జనవరి 27: భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మీడి యా సమావేశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈయూ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటానియో లూయిస్‌ శాంతోస్‌ డా కోస్టా తాను భారత సంతతి వ్యక్తినేనని చెప్పారు. అంతేకాదు మీడియా సమావేశంలో జేబులో నుంచి తన ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డును తీసి గర్వంగా ప్రదర్శించారు. ప్రస్తుతం బ్రసెల్స్‌ కేంద్రంగా ఐరోపా గమనాన్ని నిర్దేశిస్తున్న 64 ఏళ్ల ఆంటానియో కోస్టాకు భారత్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన తండ్రి ఓర్లాండో కోస్టా గోవాలో పుట్టి పెరిగారు. గోవా విముక్తి తర్వాత 18 ఏళ్ల వయసులో ఆయన పోర్చుగల్‌కు వలస వెళ్లారు. ‘‘యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా మాత్రమే కాదు.. ఒక ఓవర్సీస్‌ ఇండియన్‌ సిటిజన్‌గా ఈ వేదికపై నిలబడడం నాకు గర్వంగా ఉంది’’ అని కోస్టా భావోద్వేగంతో చెప్పారు. చిన్నతనంలో తనను కొంకణి భాషలో ముద్దుగా ‘బాబుష్‌’ (చిన్న పిల్లవాడు) అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 03:15 AM