Share News

ఇజ్రాయెల్‌కు తుర్కియే వార్నింగ్.. దాడి చేయటం మా కర్తవ్యం..

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:15 PM

తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోతే.. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్‌పై దాడి చేయటం తమ కర్తవ్యం అని అన్నారు.

ఇజ్రాయెల్‌కు తుర్కియే వార్నింగ్.. దాడి చేయటం మా కర్తవ్యం..
Erdogan Israel warning

ఇంటర్‌నెట్ డెస్క్: ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోకపోవటంతో చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫలితం ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోతే.. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్‌పై దాడి చేయటం తమ కర్తవ్యం అని అన్నారు. ఇజ్రాయెల్ చర్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


శనివారం ఎర్డోగన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మానవ విలువలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. లెబెనాన్ పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాను. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రోజు ఇజ్రాయెల్ దాడులు చేయటం దారుణం. ‘జెనోసైడ్ నెట్‌వర్క్’లో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దారుణాలకు ఒడిగడుతోంది’ అని అన్నారు.


ఇది ఒక దురదృష్టకర వార్త: జేడీ వాన్స్

ఇరాన్‌తో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించడం లేదని చెప్పారు. 21 గంటల పాటు కీలక చర్చలు జరిపామన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే.. చర్చల నుంచి వెనుదిరుగుతున్నామని తెలిపారు. ఈ పరిణామం ఇరాన్‌కు బ్యాడ్‌ న్యూస్ అన్నారు.


ఇవి కూడా చదవండి

ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..

సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలి: కేటీఆర్

Updated Date - Apr 12 , 2026 | 04:48 PM