జెన్సన్‌కు మద్దతుగా ఎన్విడియా బోర్డుకు మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాల లేఖ
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:10 AM
ఎన్విడియా సీఈవో పదవికి రాజీనామా చేసిన నాలుగు రోజులకే జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది.
వాషింగ్టన్, నవంబరు 16: ఎన్విడియా సీఈవో పదవికి రాజీనామా చేసిన నాలుగు రోజులకే జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆయనను పునర్నియమించాలని కోరుతూ కంపెనీ బోర్డుకు రాసిన ‘స్టాండ్ విత్ జెన్సన్’ బహిరంగ లేఖపై సోమవారం మధ్యాహ్నానికి 1.75 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. మరోవైపు, కొత్త సీఈవోను కంపెనీ బయటి నుంచే తేవాలని అమెరికా ఆర్ఢిక మంత్రి స్కాట్ బెసెంట్ బహిరంగంగా సూచించారు. దీంతో ఈ వ్యవహారం సిలికాన్ వ్యాలీకి, వాషింగ్టన్‌కు మధ్య పోరుగా మారుతోంది. సంతకం చేసిన వారిలో 8,700 మందికి పైగా తాము ఎన్విడియా ప్రస్తుత ఉద్యోగులమని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసినవారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. హువాంగ్ లేకపోతే కీలక సరఫరా ఒప్పందాలు కొన్ని చేజారతాయని హెచ్చరించారు. షాపిఫై సీఈవో టోబియాస్ లుట్కే, ఎపిక్ గేమ్స్ సీఈవో టిమ్ స్వీనీ, వై కాంబినేటర్ సీఈవో గ్యారీ టాన్, ఉబర్ మాజీ అధిపతి ట్రావిస్ కలానిక్ కూడా సంతకాలు చేశారు.