Share News

‘ఈఫిల్‌ టవర్‌ వివాదం’లో బాప్స్‌కు క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 02:53 AM

పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌లో మహిళా ఉద్యోగులను తప్పించిన వివాదానికి సంబంధించి హిందూ ధార్మిక సంఘం బోచాసన్‌వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామి నారాయణ్‌ సంస్థ..

‘ఈఫిల్‌ టవర్‌ వివాదం’లో బాప్స్‌కు క్లీన్‌చిట్‌

ప్యారిస్‌, అక్టోబరు 2: పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌లో మహిళా ఉద్యోగులను తప్పించిన వివాదానికి సంబంధించి హిందూ ధార్మిక సంఘం బోచాసన్‌వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామి నారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్-బాప్స్‌) బృందానికి దర్యాప్తు అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. గత నెల 5న తమ సందర్శన సందర్భంగా అక్కడి మహిళా ఉద్యోగులను తొలగించాలని బాప్స్‌ బృందం కోరలేదని ధ్రువీకరించారు. ఇది కేవలం అక్కడి సిబ్బంది మధ్య సమాచార లోపంతో ఏర్పడిన వ్యవస్థీకృత వైఫల్యమని వివరించారు. దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన పారిస్‌ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ.. ‘బాప్స్‌ బృందం తమ మత పెద్దలను మహిళలను తాకకుండా చూడాలని మాత్రమే కోరింది. అధికారులు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు’ అని వెల్లడించారు.

Updated Date - Oct 03 , 2026 | 02:55 AM