‘మక్కా ఒప్పందం’లోకి ఈజిప్ట్
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:22 AM
నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు చేసుకున్న ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’లో ఈజిప్ట్ కూడా చేరనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9 : నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు చేసుకున్న ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’లో ఈజిప్ట్ కూడా చేరనుంది. మక్కా ఒప్పందంలో ఈజిప్ట్ కూడా త్వరలో భాగస్వామి కానుందని తుర్కియే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శనివారం ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగమవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, నాటో తరహా రక్షణ ఒప్పందం ఇప్పటి ఆలోచన కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34ముస్లిం దేశాలు ఒక్కటవ్వాలని చాలా కాలం క్రితం సౌదీ పిలుపునిచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ తరహా ప్రతిపాదనకు ఈజిప్ట్ 2015లో పిలుపునిచ్చినా ముందడుగు పడలేదు. అయితే, గల్ఫ్ దేశాలపై దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం మళ్లీ తెరపైకి వచ్చింది. పాక్, సౌదీ, తుర్కియే శుక్రవారం ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తాయి.