యుద్ధం వేళ.. ఇరాన్‌లో భూకంపం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:42 AM
ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే...
రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు
టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎ్‌సజీఎస్) వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్స్‌లో ఉన్న ఖోంజ్ పట్టణానికి సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:24 గంటలకు భూమి కంపిచడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.