Share News

దుబాయ్‌లో 2వేల మంది ఖైదీల విడుదల

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:02 AM

గల్ఫ్‌ దేశాలలో బుధవారం నుంచి రంజాన్‌ ప్రారంభమైంది. సాధారణంగా భారత్‌ కంటే ఒక రోజు ముందుగా గల్ఫ్‌ దేశాలలో రంజాన్‌ ప్రారంభమవుతుంది.

దుబాయ్‌లో 2వేల మంది ఖైదీల విడుదల

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: గల్ఫ్‌ దేశాలలో బుధవారం నుంచి రంజాన్‌ ప్రారంభమైంది. సాధారణంగా భారత్‌ కంటే ఒక రోజు ముందుగా గల్ఫ్‌ దేశాలలో రంజాన్‌ ప్రారంభమవుతుంది. ముస్లింల పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్‌లో 2వేల మంది ఖైదీలను విడుదల చేస్తూ దుబాయి రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ ఆదేశాలు జారీ చేశారు. అబుదాబీ రాజు, యూఏఈ అధ్యక్షుడు కూడా అయిన షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అబుదాబీలో 1440మంది ఖైదీలను విడుదల చేశారు. షార్జా రాజు షేక్‌ సుల్తాన్‌ అల్‌ ఖాస్మీ 738 మంది ఖైదీలను విడుదల చేశారు. అప్పులు చెల్లించలేక జైలు పాలైన వారి బకాయిలను కూడా రాజులే చెల్లిస్తారు. కాగా, భారత్‌లో రంజాన్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలవంక బుధవారం కనిపించినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:02 AM