Share News

దుబాయ్‌లో మందగించిన రియల్‌ ఎస్టేట్‌!

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:38 AM

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా దుబాయిలో స్థిరాస్తుల కార్యకలాపాలు కొన్ని వారాలుగా మందగించాయి. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక స్థిరాస్తి దిగ్గజ కంపెనీ అయిన ఎమ్మార్‌ షేర్ల ధరలు 35 శాతానికి...

దుబాయ్‌లో మందగించిన రియల్‌ ఎస్టేట్‌!

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా దుబాయిలో స్థిరాస్తుల కార్యకలాపాలు కొన్ని వారాలుగా మందగించాయి. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక స్థిరాస్తి దిగ్గజ కంపెనీ అయిన ఎమ్మార్‌ షేర్ల ధరలు 35 శాతానికి పడిపోగా అన్ని రకాల క్రయవిక్రయాలు దాదాపుగా స్తంభించిపోయాయి. దుబాయితో సమానంగా స్థిరాస్తి రంగంలో పోటీపడిన రాస్‌ అల్‌ ఖైమాలో కూడా పరిస్ధితి ఒక్కసారిగా మందగించింది. రాక్‌ ప్రాపర్టీస్‌ షేర్ల ధరలు 45 శాతానికి పడిపోయినట్లుగా మార్కెట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దుబాయ్‌ ఆర్థిక వ్యవస్థలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కీలకపాత్ర వహిస్తోంది. భారత్‌, అమెరికా, ఐరోపా దేశాల్లో స్ధిరపడ్డ అనేక మంది తెలుగు ప్రవాసీయులు కూడా దుబాయి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దుబాయిలోని రియల్‌ ఎస్టేట్‌ కొనుగోలుదార్లలో గత ఏడాది భారత్‌కు చెందినవారే 23శాతం మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరు గత సంవత్సరం సుమారు రూ.95వేల కోట్లు దుబాయి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారు. దుబాయిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 199 మంది ఈ రంగంలో మధ్యవర్తులుగా పని చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఎలాంటి డీల్స్‌ లేవని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 06:39 AM