Share News

Drone Attack: ఖేర్సన్‌లో డ్రోన్‌ దాడి.. 24 మంది మృతి

ABN , Publish Date - Jan 02 , 2026 | 03:58 AM

కొత్త సంవత్సర వేడుకల వేళ రష్యా ఆక్రమిత ప్రాంతంలోని ఓ హోటల్‌, కేఫ్‌పై డ్రోన్‌ దాడులతో 24 మంది మరణించారు. మరో 50 మందికి గాయాలయ్యాయి..

Drone Attack: ఖేర్సన్‌లో డ్రోన్‌ దాడి.. 24 మంది మృతి

మాస్కో, జనవరి 1: కొత్త సంవత్సర వేడుకల వేళ రష్యా ఆక్రమిత ప్రాంతంలోని ఓ హోటల్‌, కేఫ్‌పై డ్రోన్‌ దాడులతో 24 మంది మరణించారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. ఖేర్సన్‌ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలంతా న్యూ ఇయర్‌ వేడుకల్లో ఉండగా ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లు దాడి చేయడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందని గురువారం రష్యా అధికారులు తెలిపారు. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లను పలు ప్రాంతాల్లో తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు. భద్రతా కారణాలతో పలు విమానాశ్రయాలను మూసివేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 03:58 AM