వాన్స్.. నీదే బాధ్యత!
ABN , Publish Date - May 15 , 2026 | 03:57 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉండగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలకు బయలుదేరే ముందు ట్రంప్ ఒక లేఖను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోసం ఉంచుతారట! అధ్యక్షుడి...
విదేశీ పర్యటనలకు ముందు ట్రంప్ ‘లేఖ’
వాషింగ్టన్, మే 14: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉండగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలకు బయలుదేరే ముందు ట్రంప్ ఒక లేఖను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోసం ఉంచుతారట! అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విభాగం సీనియర్ డైరెక్టర్ సబాస్టియన్ గోర్క్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. విదేశీ పర్యటనలో ఉండగా, ఒకవేళ తనకు ఏమైనా జరిగితే, ఏం చేయాలనే సూచనలు ఆ లేఖలో ఉంటాయని గోర్క్ వివరించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఆయన ఆ లేఖను రిజల్యూట్ డెస్క్‌లో ట్రంప్ ఉంచుతారని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తాను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆయన ఈ విధానం పాటిస్తున్నారని వివరించారు. చైనా పర్యటనలో ప్రస్తుతం ట్రంప్ ఉండటం, ఆయనపై దాడికి విదేశీ శక్తులు ప్రయత్నించే అవకాశం ఉన్నదంటూ వార్తలు రావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా, అమెరికా రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణించినా లేక అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తినా ఉపాధ్యక్షుడు ప్రభుత్వ బాధ్యతలు చేపడతారు.