భారత్‌పై మళ్లీ ట్రంప్ సుంకాల పోటు!
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:43 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల పోరుకు తెర తీస్తున్నారు. భారత్, చైనా, జపాన్, ఈయూలతో పాటు అనేక దేశాలపై ఈ వేటు పడనుందని..
వాషింగ్టన్, నవంబరు 24 : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల పోరుకు తెర తీస్తున్నారు. భారత్, చైనా, జపాన్, ఈయూలతో పాటు అనేక దేశాలపై ఈ వేటు పడనుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ట్రంప్ ఈ వారమే ఈ విషయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దేశాలన్నీ తమ పరిశ్రమలకు భారీ సబ్సిడీలు, ఆర్థిక సాయం చేస్తూ తమ దేశీయ అవసరానికి మించి ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటు చేసి, అమెరికాతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో చౌకగా తమ ఉత్పత్తులను కుమ్మరిస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు.