తలచుకుంటే 10 నిమిషాల్లో అణు కేంద్రాల ధ్వంసం
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:02 AM
తాము తలచుకుంటే పది నిమిషాల్లో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇప్పటికే ఇరాన్ అణుశక్తిని చాలా వరకు దెబ్బతీశామని..
ఇరాన్‌లో ఇంకా ఒకట్రెండు లక్ష్యాలు మిగిలి ఉన్నాయి: ట్రంప్
వాషింగ్టన్, నవంబరు 1: తాము తలచుకుంటే పది నిమిషాల్లో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇప్పటికే ఇరాన్ అణుశక్తిని చాలా వరకు దెబ్బతీశామని, ఇంకా తమ లక్ష్యాల్లో ఇరాన్‌లోని పికాక్సీ పర్వత ప్రాంతం కూడా ఉందని తెలిపారు. ఒకవేళ అమెరికా దాడికి దిగితే వెంటనే తీవ్రంగా ప్రతిస్పందించాలని.. ఎలాంటి భౌగోళిక పరిమితులు పెట్టుకోకుండా శత్రు స్థావరాలను నాశనం చేయాలని సైన్యానికి ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఫ్లారిడాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్‌లో ఇంకా ఒకట్రెండు అణుకేంద్రాలు మిగిలి ఉన్నాయి. తలచుకుంటే వాటిని పది నిమిషాల్లో ధ్వంసం చేయగలం’ అని చెప్పారు. ఇరాన్‌పై దాడి చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. అది తెలివి తక్కువ ప్రశ్న అని, తాను దాడి చేయాలనుకుంటే, చెప్పి చేస్తానా అని అన్నారు. ఇరాన్ నాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయని, కానీ వాళ్లను నమ్మలేమన్నారు. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్‌పై స్వల్ప సమయంలోనే భారీస్థాయి లో విరుచుకుపడి.. కీలక లక్ష్యాలను దెబ్బతీసే దిశ గా ఇరువురు చర్చలు జరిపినట్టుగా సమాచారం.