Share News

తడబడుతూ నడక.. కూర్చోవడానికీ ఇబ్బంది

ABN , Publish Date - Mar 23 , 2026 | 07:36 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (79)కి ఏమైంది? ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా? సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం దిగేటప్పుడు...

తడబడుతూ నడక.. కూర్చోవడానికీ ఇబ్బంది

  • ట్రంప్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చ

వాషింగ్టన్‌, మార్చి 22: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (79)కి ఏమైంది? ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా? సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం దిగేటప్పుడు తడబడుతూ అడుగులు వేయడంతో పాటు మరో కార్యక్రమంలో కుర్చీలో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. ఆ వీడియోలు వైరల్‌ కావడంతో ట్రంప్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. శనివారం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ట్రంప్‌ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్‌ పట్టుకుని విమానం దిగుతూ కనిపించారు. మెట్లపై చాలా జాగ్రత్తగా నడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ముందు రోజు ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. అందులో ట్రంప్‌ కుర్చీలో కూర్చునేందుకు ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. .

Updated Date - Mar 23 , 2026 | 07:36 AM