జిబూతీ తీరంలో పడవ బోల్తా..109 మంది మృతి
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:41 AM
తూర్పు ఆఫ్రికా దేశమైన జిబూతీ తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 305 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో మునిగిపోవడంతో..
116 మంది గల్లంతు
జెనీవా, అక్టోబరు 11: తూర్పు ఆఫ్రికా దేశమైన జిబూతీ తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 305 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో మునిగిపోవడంతో 109 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. మృతుల్లో 15మంది చిన్నారులు ఉన్నారు. మరో 116 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి 80మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, వీరందరినీ ఇథియోపియా దేశస్థులుగా గుర్తించారు. గురువారం అర్ధరాత్రి పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. పడవ జిబూతీ నుంచి యెమన్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఆఫ్రికా దేశాలైన ఇఽథియోపియా, సోమాలియా నుంచి ఏటా వేలాది మంది ఉపాధి, సురక్షిత జీవనం కోసం జిబూతీ మీదుగా ‘బాబ్ ఎల్ మండెబ్’ జలసంధి దాటి గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో చాలా సార్లు ప్రమాదాలు సంభవించాయి.